చీరాల ఆర్డీవో చంద్రశేఖర నాయుడు సోమవారం అద్దంకి మండలంలోని ధర్మవరం కొండను సందర్శించారు. అక్కడ అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం నేపథ్యంలో ఈ తనిఖీ నిర్వహించారు. ఎవరు అక్రమ తవ్వకాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతో పాటు తహశీల్దార్ శ్రీచరణ్, సర్వేయర్ శ్రీలక్ష్మి, ఆరి శంకర్ ఉన్నారు.