ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ మంగళవారం పరిశీలించారు. గోడౌన్ భద్రతా ఏర్పాట్లు, నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు, గార్డ్ రూములు, సీసీ కెమెరాల పనితీరు, ఇన్వర్టర్ వ్యవస్థలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్