విద్యుత్ శాఖ తనిఖీల్లో అక్రమాలు వెలుగురూ. 5. 89 లక్షల జరిమానా

విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు శుక్రవారం మందడం సెక్షన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. లింగాయపాలెం, ఎంవీపాలెం, మల్కాపురం, నేలపాడు, రాయపూడి, శాఖమూరు, వెలగపూడి, వెంకటపాలెం గ్రామాల్లో 35 బృందాలుగా ఏర్పడిన అధికారులు, సిబ్బంది మొత్తం 2, 501 విద్యుత్ సర్వీసులను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ వినియోగిస్తున్న 111 కనెక్షన్లను గుర్తించి, వాటిపై మొత్తం రూ. 5. 89 లక్షల అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ విద్యుత్ వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్