గుడ్‌న్యూస్... రూ.7,059 కోట్ల బకాయిలు విడుదల

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేపట్టారు. నిధుల లభ్యతను బట్టి వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా ఆర్థిక శాఖ రూ.7,059 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో ప్రావిడెంట్ ఫండ్ కింద రూ.1,847.83 కోట్లు, గ్రాట్యుటీ కింద రూ.3,411.03 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.1,800 కోట్లు, పోలీసులకు అదనపు సరెండర్ లీవుల కింద రూ.223.47 కోట్లు విడుదల చేశారు. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ నిమిత్తం 4,793 మంది ఉద్యోగులకు రూ.76 కోట్ల చెల్లింపులు జరిగాయి. చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల మేర పెండింగ్ బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి.

సంబంధిత పోస్ట్