గురువారం నగరంలోని బస్టాండు సెంటర్, మార్కెట్ సెంటర్, స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. రాంగ్ పార్కింగ్ చేసిన 30 మందిపై, సరైన డాక్యుమెంట్లు లేని 12 మందిపై, శిరస్త్రాణం ధరించని 14 మందిపై, ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నందుకు 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్సైలు రవీంద్ర, శ్రీనివాసరావు, విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు.