ఆస్తిపన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ఆదివారం కూడా జీఎంసీ ప్రధాన, సర్కిల్ కార్యాలయాల్లో నగదు కౌంటర్లు తెరిచి ఉంటాయని కమీషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ముందస్తు పన్ను చెల్లిస్తే 5% రాయితీ, బకాయిలను ఏకమొత్తంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 47.39 కోట్ల ముందస్తు ఆస్తిపన్ను వసూలైందని కమీషనర్ వెల్లడించారు.