గుంటూరు జిల్లాలో పులిచింతల నుంచి 77,316 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగలక్ష్మీ గురువారం సూచించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండల అధికారులకు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.