గుంటూరు: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 3న పీవీఎస్ లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో, నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పర్యటన మార్గం, ఆసుపత్రిలోని ప్రారంభోత్సవ విభాగాలు, సభా వేదిక, పరిసరాల్లో పారిశుద్ధ్య ఏర్పాట్లను తనిఖీ చేసి, అన్ని సదుపాయాలు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో లలితా హాస్పిటల్ డాక్టర్ రాఘవ శర్మ, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్