గుంటూరు: రేషన్ దుకాణాలలో విస్తృత తనిఖీలు..

జిల్లాలో రేషన్ దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, సిబ్బందితో కలిసి ఫిబ్రవరిలో రేషన్ పంపిణీ జరుగుతున్న పలు చౌక ధరల దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాటిలో వ్యత్యాసాలు గుర్తించిన రేషన్ దుకాణాల డీలర్లపై 6ఎ, క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్