గుంటూరు జీజీహెచ్‌లో అధునాతన సౌకర్యాలతో కూడిన విచారణ కేంద్రాన్ని ఈ నెల 12న ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో రోగులకు అవసరమైన రిసెప్షన్, ఐపీ, ఎంక్వయిరీ సేవలు ఒకేచోట అందుబాటులోకి వస్తాయి. పరీక్షల రిపోర్ట్స్ నుండి ఇన్‌పేషెంట్ రోగుల వివరాల వరకు అన్ని సేవలను సమగ్రంగా అందించేలా దీనిని రూపొందించారు. రోగులు ఆస్పత్రిలో ఇబ్బంది పడకుండా అన్ని సేవలను ఒకేచోట ఏర్పాటు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోగుల క్షేమమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని సిద్ధం చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.