గతంలో వర్షం వస్తే నగరపాలక సంస్థ కార్యాలయం మునిగిపోవడంతో ప్రస్తుతం నూతన డ్రైనేజ్ సిస్టంలో ఏర్పాటు చేయాలని ప్రణాళికను సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయం మునగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మరియు నగరపాలక కమిషనర్ శ్రీనివాస్ సోమవారం పర్యటించి కార్యాలయం యొక్క అభివృద్ధి ప్రణాళికను సమీక్షించారు. వర్షం వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని కిందిస్థాయి అధికారులకు వారు సూచించారు.