గుంటూరు నగరపాలక సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. UNIDO వారి జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును కమిషనర్ మయూర్ అశోక్ అందుకున్నారు. విజయవాడలో సోమవారం జరిగిన ‘సస్టెనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్ట్’ ముగింపు వర్క్‌షాప్‌లో కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా కమిషనర్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారం GMC బాధ్యతను పెంచిందని కమిషనర్ అన్నారు.