గుంటూరు: ప్రభుత్వం దృష్టికి విలీన గ్రామాల ప్రతిపాదన

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 18 గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదన ప్రభుత్వానికి చేరింది. ఇప్పటికే 11 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలను జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. మిగిలిన ఏడు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాల్సి ఉంది. గతేడాది డిసెంబరు 31లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో ఆఘమేఘాలపై కౌన్సిల్ ముందు ఉంచారు. చర్చల అనంతరం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించినట్లు జీఎంసీ వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది.

సంబంధిత పోస్ట్