గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నగర అభివృద్ధిపై అధికారులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం సముక్ష సమావేశాన్ని నిర్వహించారు. గుంటూరు నగరంలోని బ్రిడ్జిలపై మరియు రోడ్ల మరమ్మతుల పై మున్సిపల్ కార్పొరేషన్ లో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్, ఎమ్మెల్యే మాధవి, పత్తిపాటి ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టరేట్, మున్సిపల్ కమిషనర్, నగర మేయర్, మరియు అధికారులు పాల్గొన్నారు.