గుంటూరు: ఒక్క రోజే రూ. 9 కోట్లు వసూలు

ఆర్థిక సంవత్సరం చివరి రోజున, మంగళవారం, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) ఆస్తిపన్ను వసూళ్లలో రికార్డు సృష్టించింది. ఒక్కరోజే రూ. 9 కోట్ల వరకు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 155.20 కోట్లు వసూలయ్యాయని, ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా ఉందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక పన్ను వసూలు చేసిన కార్పొరేషన్లలో గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజుల ద్వారా రూ. 6.80 కోట్ల డిమాండ్‌కు గాను రూ. 6.21 కోట్లు వసూలయ్యాయని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్