నగరంలో టెండర్లు పూర్తయిన ప్రాంతాల్లో డ్రెయిన్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కమిషనర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మంగళవారం బాలాజీనగర్, కృష్ణ బాబునగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో రహదార్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, వర్షాలతో నీరు నిల్వకుండా గోతులు తీసిన చోట తక్షణమే పనులు చేపట్టాలని సూచించారు. లక్ష్మీపురం ప్రధాన రోడ్డులో డ్రెయిన్ నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు.