గుంటూరు: సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

గుంటూరులోని పీవీఎస్ లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రానున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ అధికారులను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం ఆయన జాతీయ రహదారి, ఆసుపత్రి పరిసరాలు, సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. సమీప గ్రామాల ప్రజలు పశువులను రోడ్లపైకి వదలకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్