స్వచ్ఛ సర్వేక్షణ్ గుంటూరు నగరపాలక సంస్థ మెరుగైన పనితీరు కనబరిచింది. దీనిపై నగర కమిషనర్ శ్రీనివాస్ స్పందించారు. "ప్రతి డివిజన్లో సూక్ష్మస్థాయిలో పరిశీలన చేశాం. స్వచ్ఛత సాధనకు ప్రజా భాగస్వామ్యం కీలకం కాబట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. వీధులను చెత్తరహితంగా మార్చాం. డంపర్బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధుల సహకారంతో పారిశుద్ధ్య వ్యవస్థను మరింతగా మెరుగుపరుస్తాం" అన్నారు.