గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నగర అభివృద్ధిపై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మూడు వారాలకు ఒకసారి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై సమీక్ష నిర్వహిస్తామని అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అభివృద్ధిపై అధికారులకు తగు సూచనలు ఇచ్చామని అని సందర్భంగా తెలిపారు.