గుంటూరు-2 ఆర్టీసీ డిపోలో విద్యుత్ బస్సుల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లను పొన్నూరు, తెనాలి, మంగళగిరి డిపోలకు వారి ఇష్ట ప్రకారం మరో రెండు రోజుల్లో బదిలీ చేయనున్నారు. మొత్తం 450 మందిలో 24 మందిని అద్దె బస్సులు నడిపేందుకు ఉంచి, మిగిలిన వారిని కోరుకున్న డిపోలకు తరలించనున్నారు. ఈ డిపో పరిధిలోని బస్సుల్లో (అద్దెవి మినహాయించి) మంగళగిరి డిపోనకు 29, తెనాలికి 19, పొన్నూరుకు 15 తరలించనున్నారు.