గుంటూరు రేంజ్‌లో ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. 2025-26 సంవత్సరానికి గాను 34 మంది అధికారుల జాబితా సిద్ధమైంది. గుంటూరు జిల్లాకు చెందిన క్రాంతి కిరణ్, ఏడుకొండలు, రవీంద్రబాబు వంటి ఎస్ఐలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిపై ఎలాంటి కేసులు, పెండింగ్ శిక్షలు ఉన్నాయా అనే దానిపై ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.