పోస్టర్లు, ఫ్లెక్సీలపై కఠిన చర్యలు: గుంటూరు కమిషనర్

గుంటూరును పోస్టర్ రహిత నగరంగా మార్చేందుకు మునిసిపల్ కమిషనర్ మయూర్ అశోక్ చర్యలు చేపట్టారు. పోస్టర్లు తొలగించడానికి 12 బృందాలు రంగంలోకి దిగాయి. మళ్లీ పోస్టర్లు అంటించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొదటిసారి పోస్టర్ అంటిస్తే రూ. 1000, రెండోసారి అంటిస్తే రూ. 5000 జరిమానా విధిస్తారు. అయినా ఆగకపోతే పోలీసు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు లేకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గుంటూరును పోస్టర్లు, ఫ్లెక్సీలు లేని తొలి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్