గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్‌లోని దుకాణాలు, సదుపాయాలను జిల్లా ప్రజా రవాణా అధికారిణి సామ్రాజ్యం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే వస్తువులు విక్రయించాలని, అనుమతించినవే అమ్మాలని ఆమె స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరుగుదొడ్లను పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.