నగరంలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు

మండల కేంద్రం నగరంలో బుధవారం కూరగాయల మార్కెట్లో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా తూనికల శాఖ అధికారి రామదాసు ఆధ్వర్యంలో సిబ్బంది పలు వ్యాపార సంస్థలు కూరగాయల మార్కెట్లలో తూనికల పరికరాలను సరిచూశారు. వినియోగదారులను మోసం చేయకుండా, తూనికల్లో ఎలాంటి తేడాలు ఉండకుండా ఉండేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ కాటాల ముద్రలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్