బల్లికురవ: ప్రీమియం చెల్లింపునకు రేపే చివరి అవకాశం

బల్లికురవలో ఖరీఫ్ సీజన్ లో పత్తి పంట సాగు చేసే రైతులందరూ రేపటిలోగా ప్రీమియం చెల్లించాలని ఏవో శ్రీనివాసరావు సోమవారం తెలియచేశారు. ఎకరాకు 1900 రూపాయలు ప్రీమియం కట్టాలని ఆయన సూచించారు. అనివార్య కారణాల వల్ల పంట నష్టం జరిగితే ఎకరాకు 38, 000 బీమా వర్తిస్తుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కావున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్