గుంటూరులో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో గుంటూరు కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు, పర్యవేక్షణ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను సకాలంలో నిర్మించడమే కాకుండా సరైన నాణ్యత పాటించాలని ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు.