ప్రకాశం బ్యారేజీ నుంచి 3 లక్షల వరద నీరు రావచ్చని, ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంత అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితుల పై సమీక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద నేపథ్యంలో గ్రామ, జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.