గుంటూరు మిర్చికి జాతీయ స్థాయిలో బహుమతి

ఒక జిల్లా - ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) కింద గుంటూరు మిర్చికి జాతీయ స్థాయిలో తొలి బహుమతి లభించడం గర్వకారణమని గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ చేతుల మీదుగా సోమవారం గుంటూరు మిరపకు వచ్చిన పురస్కారాన్ని స్వీకరించారు. జాతీయ స్థాయిలో మొదటి బహుమతి అందుకోవడం జిల్లా తరపున ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్. సవిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్