గుంటూరు జిల్లాలో జీఎస్టీ వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు వాణిజ్య పన్నుల శాఖకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, జీఎస్టీ చెల్లింపులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, అవకతవకలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రతి నెలా సమీక్షలు నిర్వహించి, శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.