గుంటూరు నగరంలో అనధికార నిర్మాణాలను ఉపేక్షించబోమని, పట్టాభిపురంలో భవన నిర్మాణ ప్లాను లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాన్ని కూల్చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రణాళిక అధికారులను శుక్రవారం సాయంత్రం ఆదేశించారు. పట్టాభిపురం, స్తంభాలగరువు, మిర్చియార్డు రోడ్డు, వీఐపీ రోడ్లలో పర్యటించి అనధికార కట్ట డాలు, ఆక్రమణలను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.