గుంటూరు: నలుగురు తహసీల్దార్లకు స్థాన చలనం

గుంటూరు జిల్లాలో నలుగురు తహసీల్దార్లకు స్థానచలనం కలిగింది. ప్రత్తిపాడు తహసీల్దార్గా పనిచేస్తున్న జి. కరుణకుమార్ను గుంటూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఏవోగా, తుళ్లూరు తహసీల్దార్ సుజాతను ప్రత్తిపాడుకు బదిలీచేశారు. మేడికొండూరు తహసీల్దార్ ఎం. హరిబాబును తుళ్లూరుకు బదిలీ చేస్తూ ఆయన స్థానంలో రాష్ట్ర సచివాలయం నుంచి వచ్చిన రాఘవరావును నియమిస్తూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్