గుంటూరు జిల్లాలోని సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తాయి. ప్రతీ బృందంలో ఒక గైనకాలజీ హెచ్ఎ్వడీతోపాటు ప్రోగ్రాం అధికారులు, వైద్యులు ఉంటారు. రెండు బృందాలు తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో తనిఖీలు చేస్తాయి. మిగిలినవి గుంటూరు నగరంలోని ఆసుపత్రులను పరిశీలిస్తాయి.