గుంటూరు: నేడు రాజధాని భూసమీకరణ సమస్యలపై సమావేశం

రాజధాని రెండో విడత భూసమీకరణకు సంబంధించిన సమస్యలపై బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో సమావేశం జరుగుతుందని జిల్లా పాలనాధికారి తమీమ్ అన్సారియా మంగళవారం తెలిపారు. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు, సీఆర్డీఏ అధికారులు, ల్యాండ్స్ డైరెక్టర్, డైరెక్టర్ (సీఆర్), ప్రణాళిక విభాగం డైరెక్టర్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, సర్వే ఏడీ పాల్గొంటారు. ఈ సమావేశం భూసమీకరణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది.

సంబంధిత పోస్ట్