గుంటూరులో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఎన్టీబి సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సింగయ్య మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ప్లకార్డుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.