కలెక్టరేట్లోని ఎస్. ఆర్. శంకరన్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సి. ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని, సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అలాగే “మీకోసం” వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అర్జీలు పంపే సౌకర్యం ఉందన్నారు. అదేవిధంగా 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు వాటి స్థితిని తెలుసుకోవచ్చని సూచించారు.