కలెక్టరేట్లోని ఎస్. ఆర్. శంకరన్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయిలో ఈ క్లినిక్ నిర్వహిస్తున్నారు. అన్ని మండలాల తహసీల్దార్లు, గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారులు గ్రామస్థాయి రికార్డులతో హాజరవుతారు. ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి, వాటి స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతారు.