గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన జిల్లా గుంటూరు అని, తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.