గుంటూరు: రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన రెవెన్యూ అర్జీలపై, ఆ శాఖ నోడల్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. అధికారుల వద్దకు వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి, సమస్యపై పూర్తి అవగాహన పొందాలని, తర్వాత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు సోమవారం అందుకున్న వినతులపై శుక్రవారం నాటికి స్పష్టమైన సమాచారంతో ఉండాలని, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్