ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల వరకు విస్తరిస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. రేపు (సోమవారం) ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారు. ప్రజలు తమ సమస్యలను సమీప కార్యాలయాల్లో అందించవచ్చని సూచించారు.