గుంటూరు: పెట్రోలు బంకుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తాం

పెట్రోలు బంకుల వద్ద పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రతి బంకుకు ఇద్దరు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ సతీష్‌కుమార్ జిందాల్ తెలిపారు. గొడవలు, తోపులాటలు నివారించేందుకు ప్రతి స్టేషన్ స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమిస్తామని, రైతులు, ప్రజారవాణాకు ప్రాధాన్యతగా ఇంధనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కృత్రిమ కొరత సృష్టించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్