గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఊతమిస్తూ, శంకర్ విలాస్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి, బి. సి. జనార్దన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, నాణ్యతతో పాటు గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ ROB ను త్వరగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు. అభివృద్ధి పనుల ద్వారా ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.