రద్దీ రహదారుల్లో ప్రమాదాల ముప్పు

కారంపూడి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మాచర్ల, వినుకొండ ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో నాగులేరు బ్రిడ్జి నుంచి చెక్‌పోస్ట్ వరకు తరచుగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. వ్యవసాయ సీజన్ నేపథ్యంలో ఆటోలు, ట్రాక్టర్లలో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో కూలీలు ప్రయాణించడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ రవాణా, పోలీసు శాఖలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్