లింగం గుంట్ల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఈఓ

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ బుధవారం చిలకలూరిపేట మండలం, లింగం గుంట్ల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె హాజరు రికార్డులను పరిశీలించి, పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పర్యవేక్షించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాలను అంచనా వేశారు. విద్యార్థుల ప్రతిస్పందనపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్