అంగనవాడీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తపరిచిన ఎంపీడీవో

మాచవరం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఎంపీడీవో చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని, కార్యకర్తల హాజరు, పనితీరు కూడా బాగాలేదని అన్నారు. పాలు, గుడ్లు వంటివి కొన్ని బయట షాపుల్లో కనిపిస్తున్నాయని, ఈ విషయంపై సంబంధిత సూపర్వైజర్లకు ఎంపీడీవో చిరంజీవి తెలిపారు.

సంబంధిత పోస్ట్