మాచర్ల పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం గురువారం ఛైర్మన్ షేక్ మదార్ అధ్యక్షతన జరిగింది. పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ. మాచర్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.