పల్నాడు జిల్లా మాచర్లలో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ మజ్జిగ చలివేంద్రంను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మంగళవారం ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. అనంతరం కలెక్టర్ స్వయంగా పాదాచారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు.