మాచర్లలో జాతీయ రహదారి విస్తరణ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంబేడ్కర్ పార్క్ నుంచి రాయవరం జంక్షన్ వరకు రహదారి పరిస్థితులను తహశీల్దార్ కిరణ్ కుమార్, మునిసిపల్ కమిషనర్ వేణుబాబు, పట్టణ సీఐ వెంకటరమణ పరిశీలించారు. విస్తరణ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతపై అధికారులతో చర్చించారు.