మాచర్లలో చెన్నకేశవస్వామి దేవుని మాన్యం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని తహశీల్దార్ బందెల కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అనంతరాములు, టిడిపి నాయకులు కొమెరా దుర్గారావులు తహశీల్దార్ ను కలిసి దేవాలయానికి సమీపంలో ఉన్న మూడెకరాల దేవుని మాన్యం ఆక్రమణకు గురవుతుందని, దానిని కాపాడాలని కోరారు. అన్యాక్రాంతమవుతున్న దేవదాయ భూములను తిరిగి దేవాలయానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ హామీ ఇచ్చారు.