పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారి సస్పెన్షన్!

జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గత ప్రభుత్వ హయాంలో 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన' పథకం నిధుల దుర్వినియోగం, వాహనాల మంజూరు, బోట్ల లైసెన్సుల జారీలో ఆయన అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు, అక్రమాలు జరిగినట్లు నిర్ధారించడంతో మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ రమాశంకర్ నాయక్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్