టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను కలిసి అభినందించారు. లోకేశ్ సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదిన వేడుకలు నిర్వహించారు. లోకేశ్ కేక్ కట్ చేయించి, ఎంపీకి తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.